Home / POLITICS / టీ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్…

టీ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్…

తెలంగాణ రాష్ట్ర శీతాకాల స‌మావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంద‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ స‌హా విప్‌లు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ శీతాకాల‌ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డిన అనంత‌రం చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ లు న‌ల్లాల‌ ఓదెలు,గంప గోవర్ధన్, గొంగిడి సునీత విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అసెంబ్లీ ,మండలి శీతాకాల సమావేశాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. గతంలో శీతాకాల సమావేశాలు ఐదారు రోజులు మాత్రమే నడిచాయని ఇపుడు పదహారు రోజులు జరిగాయని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలన్నింటిపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల హాడావుడి చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని వారు ఎద్దేవా చేశారు. మొదటి రోజే చలో అసెంబ్లీ కి పిలుపునిచ్చి కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్,బీజేపీలు కేవలం ఉనికి ని చాటుకోవడానికే అన్నట్టుగా వ్యవహరించాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో నేతల మధ్య సమన్వయ లేమి కొట్టొచ్చినట్టు కనిపించిందని తెలిపారు. అధికార యావ తప్ప కాంగ్రెస్ కు మరొకటి లేదని అన్నారు.

ప్రజలు ప్రభుత్వాన్ని గుండెలకు హత్తుకునేలా సమావేశాలు సాగాయని తెలిపారు. నీళ్లు-నిధులు-నియామకాలు అనే ఉద్యమ టాగ్ లైన్ ను నేరవేర్చే దిశగా ప్రభుత్వం చేస్తున్న పనులు కాంగ్రెస్ కు కనబడడం లేదని త‌ప్ప‌ప‌ట్టారు.కాంగ్రెస్ నేత‌ల‌కు కళ్లుండి కూడా ప్రభుత్వ అభివృద్ధిని చూడలేకపోతున్నారని మండిప‌డ్డారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని పేర్కొంటూ ఇలాంటి ప్రాజెక్టు కాంగ్రెస్ హాయం లో అమలుకు నోచుకుందా అని వారు సూటిగా ప్ర‌శ్నించారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక చట్టం అమలు గురించి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చక్కగా వివరించారని గుర్తు చేశారు. ఇప్పటికే ప్రత్యేక చట్టం కింద 38 శాతం నిధులు ఖర్చయ్యాయ‌ని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat