అర్థం పర్థం లేని కామెంట్లు చేస్తూ అనవసర గందరగోళం సృష్టిస్తున్న ఉద్దేశపూర్వక విమర్శకులకు మంత్రి కేటీఆర్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. హైదరాబాద్‌లో రోడ్లను బాగు చేయడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ముందుకు సాగుతున్నప్పటికీ…విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఘాటుగా రియాక్టయ్యారు. సోమాజిగూడా హోటల్ పార్క్ లో ఫ్రీడమ్ హైదరాబాద్ 10కే రన్ ప్రెస్ మీట్ కు హాజరైన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా 10కె రన్ టీ-షర్ట్, మెడల్స్ ను ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేవలం ఇవాంకా ట్రంప్ వస్తున్నదని రోడ్లు బాగు చేస్తున్నాం అనే ప్రచారం తప్పని స్పష్టం చేశారు. వర్షాకాలం తర్వాత సాధారణంగా చేసే రిపేర్లు సాగుతున్నాయన్నారు. చార్మినార్ వద్ద అభివృద్ధి పనులను కూడా అలానే అనుకుంటున్నారని కానీ. అది కూడా ముందే ప్లాన్ చేశామని మంత్రి కేటీఆర్ వివరించారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ లో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు, జనవరిలో, ఫిబ్రవరిలో అంతర్జాతీయ సదస్సులు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా అవసరాలను తీర్చేందుకు పనిచేస్తోందని వివరించారు. రాష్ట్ర ఆర్ధిక వృద్ధి, అభివృద్ధి కొనసాగుతోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
10కే రన్ 15వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నందుకు అభినందనలు తెలుపుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో రోజు పరుగెత్తుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఎన్నో ఈవెంట్స్ జరుగుతున్నందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. క్రికెట్ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నా.. రన్నింగ్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. 10కే రన్ నిర్వహించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని పేర్కొంటూ స్పాన్సర్స్ అందరికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
Post Views: 240