టీం ఇండియా -లంక మధ్య కలకత్తాలోని ఈడెన్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో వరుణుడి ప్రతాపం తగ్గడంలేదు .తొలిరోజు దాదాపు పదకొండు ఓవర్లపాటే జరిగిన రెండు రోజు మాత్రం అంతకు డబుల్ అంటే కేవలం ట్వంటీ ఓవర్స్ మాత్రమే ఆట కొనసాగింది .శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా జట్టు 74/5 వద్ద ఉండగా మరోసారి వర్షం అడ్డుతగిలింది .
దాదాపు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కూడా ఎంతసేపటికి వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేయకతప్పలేదు .మొదటి టెస్ట్ లో రెండు రోజుల్లో కేవలం 32.5 ఓవర్ల మాత్రమే ఆట సాగింది .నిన్న గురువారం 17 /౩ ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం ఆటను ప్రారంభించిన టీంఇండియా కేవలం మరో ముప్పై మూడు పరుగులను జోడించి మరో రెండు వికెట్లను కోల్పోయింది .దీంతో యాబై పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది .ప్రస్తుతం ఓవర్ నైట్ ఆటగాడు పుజారా (102 బంతుల్లో 47 బ్యాటింగ్ ),సాహ ఆరు పరుగులతో క్రీజ్ లో ఉన్నారు .