ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టాడో కాని , లాంచింగ్ నుండి ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. దర్శకుడిని కొట్టడం, సెట్స్ ని ధ్వంసం చేయడం, సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ లు ఇవ్వడం ఇలా అనేక వివాదాల మధ్య ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 1న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే మళ్లి ఇప్పుడు పద్మావతి సినిమాలో నటించిన దీపికా పదుకోణికి భద్రత పెంచారు. ఆమెను హతమార్చుతామని కొందరు,ముక్కు కోస్తామని మరికొందరు హెచ్చరికలు చేస్తున్న నేపధ్యంలో ఆమె కు భద్రత పెంచారు.ఆమె ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు.. పద్మావతి సినిమాను చరిత్రను వక్రీకరించేలా తెరకెక్కించారని, ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని రాజ్‌పుత్ సంఘాలతో పాటు హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. రాణీ పద్మినిగా దీపికా పదుకోన్ నటించారు. రాజ్ పుట్ సంఘాలు,కర్ణిసేన మొదలైనవి ఆమెకు హెచ్చరికలు పంపుతున్నాయి.ఆమెను హతమార్చిన వారికి రూ 5 కోట్లు ఇస్తామని..దీపిక ముక్కు కోస్తామని వీరు అంటున్నారు. ఇక పద్మావతి డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, దీపికా పదుకోన్‌ల తలనరికిన వారికి రూ 5 కోట్లు ఇస్తామని యూపీకి చెందిన చైతన్య సమాజ్ పేర్కొంది.
