తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు .ఇవాళ అసెంబ్లీ లాబీలో అయన మీడియా తో మాట్లాడారు … సభలో ప్రతిపక్షాలు సరియైన సూచలనలు చేయలేక పోతున్నాయన్నారు . ప్రతిపక్షాల తీరు చూసి ప్రజలు నవ్వుతున్నారన్నారు . రాష్ట్ర ప్రజలు సీఏం కేసీఆర్ గారి పాలన పట్ల సంతృప్తి తో వున్నారన్నారు .బంగారు తెలంగాణ అంటే ప్రజలకు ప్రభుత్వ ఫలాలు డైరెక్ట్ గా అందడమే అని పేర్కొన్నారు . కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి బంగారు తెలంగాణ నిర్మాణము కనిపించడం లేదా? అని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రశ్నించారు. .మిషన్ కాకతీయ ఫలితాలు బంగారు తెలంగాణ కు నిదర్శనం అని పేర్కొన్నారు .పంటలు బాగా పండుతున్నాయి. రైతులకు మద్దతు ధర ఇస్తున్నాం.. ఇది బంగారు తెలంగాణ కాదా? అని ప్రశ్నించారు