నంది అవార్డుల ఎంపికపై సెటైరిక్‌గా స్పందించడంతో ఆగ్రహానికి గురైన అవార్డ్ కమిటీ మెంబర్ మద్దినేని రమేష్ బాబు బూతు పురాణాన్ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్‌లో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సినీ విమర్శకుడు కత్తి మహేష్ మద్దతు తెలిపారు.‘ప్రజాస్వామిక విలువలు లేని జ్యూరీ సభ్యులు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఎవరు నమ్మాలి? ఫ్యూడల్, పితృస్వామిక, కుల భూయిష్టమైన భావజాలం కలిగినవాళ్ళు ప్రజాస్వామిక నిర్ణయం తీసుకోగలరా అనే ఒక విజ్ఞత కలిగిన ప్రశ్న RGV ది. దీనికి సమాధానం ఉందా!?! అని కత్తి మహేశ్ శుక్రవారం తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశాడు.
ఇంతకీ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నేంటంటే..? ‘ఒక ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఒక విషయం మీద అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఎవరికైనా ఉంటుంది…..అలాగే నేను నంది అవార్డులు ఇచ్చిన వైనంపై స్పందించాను. అని దీనికి అవార్డ్ కమిటీ మెంబర్ మద్దినేని రమేష్ బాబు తనపై బూతు పదాజలంతో ఘాటుగా స్పందించారు. నన్ను తిట్టినందుకు నాకేం బాధ లేదు……. కానీ ఇలాంటి వ్యక్తులని అవార్డ్ కమిటీలో ఎన్నుకున్నందుకు ప్రభుత్వం మీద బాధగా ఉంది. ఇలాంటి వ్యక్తులని మెంబర్లుగా ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ఆశ్చర్యపడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు………. అన్నం గురించి తెలియటానికి ఒక్క మెతుకు చాలంటారు. ఈ మద్దినేని రమేష్ బాబు ఆ మెతుకైతే అన్నం కమిటీ అనుకునే పరిస్తితి వచ్చినందుకు వివరణ ప్రభుత్వమే చెప్పాలి. అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశాడు.