జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. సినీ విమర్శకుడు కత్తి మహేష్ మధ్య సోషల్ మీడియా సాక్షిగా మాటల యుద్ధం జరుగుతోంది. జబర్ధస్థ్ షోలో హైపర్ ఆది మహేష్ కత్తిని టార్గెట్ చేసి సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆది వేసిన సెటైర్లకి స్పందిస్తూ కత్తి తీవ్రంగా విమర్శించడమే కాకుండా పవన్ ఫ్యాన్స్ పై కూడా మరోసారి విమర్శలు చేశాడు.
అయితే అంత వరకు బాగానే ఉంది కానీ.. కత్తి ఎవరినైతే తీవ్రంగా విమర్శించాడో.. అదే వ్యక్తి అంటే హైపర్ ఆదితో ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. హైపర్ ఆదిని లండన్‌బాబు షూట్‌లో కలిశాను మనుషులుగా మాకు ద్వేషాలు లేవు. సిద్ధాంతంపరంగా ఎవరి ఉద్దేశాలు వారికి ఉన్నాయి. హైపర్ ఆది చేసే కొన్ని కామెడీ స్కిట్లు కొన్ని విషయాలు నాకు నచ్చవు. నన్ను టార్గెట్ చేశారు అనుకున్న వాటిల్లో ఆ విషయం కూడా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పానని.. మేమంతా ఒకటే… అభిమానులే వెధవలు అని పోస్టు పెట్టాడు.
దీంతో సోషల్ మీడియాలో స్పందించిన హైపర్ ఆది.. ఫ్యాన్స్ అనే పదం కింద మీరు వెధవ అన్నారు. అసలు అభిమానులే లేకపోతే రివ్యూ రాయడానికి కూడా పనికిరారు. వాళ్లు తప్పు, ఒప్పు అని చెబితేనే మీరు రివ్యూలు రాయగలుగుతున్నారు. అలాంటిది ఫ్యాన్స్‌ని వెధవలు అనే రైట్ మీకు ఉందా అని ప్రశ్నించాడు. దీంతో స్పందించిన కత్తి.. నేను మిమ్మల్ని తిట్టడాన్ని, నన్ను మీరు తిట్టడాన్ని ఎవరైతే సెలబ్రేషన్ చేసుకుంటున్నారో నేను వాళ్లను వెధవలు అంటున్నాను. మీరు వెధవ కాదు కదా.. మరి ఎందుకు ఫీలవుతున్నారు.. అంటూ హైపర్ ఆదికి కౌంటర్ ఇచ్చాడు కత్తి మహేష్.