తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో కీలక సంస్థ ఏర్పాటు కానుంది. కెనడాలోని ప్రపంచ ప్రఖ్యాత వాంకువర్ ఫిల్మ్ స్కూల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒక ఎంఓయును కుదుర్చుకుంది. కెనడా ఇంటర్నెషనల్ ట్రేడ్ శాఖ మంత్రి ఫ్రాంకోయిస్ పిలిప్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కే తారకరాముతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరిత హారం వంటి కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ, ఐటీ పాలసీలోని కీలక అంశాలను తెలియజేశారు. కెనడా దేశం నుంచి వచ్చే పెట్టుబడులకు పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామని హమీ ఇచ్చారు.
అనంతరం కెనడా మంత్రి ఫ్రాంకోయిస్ , రాష్ట్ర మంత్రి కే తారక రామరావు సమక్షంలో ఒప్పందం కుదిరింది. తాము గేమింగ్, యానిమేషన్ రంగానికి ప్రాదాన్యత రంగంగా గుర్చించామని, ప్రస్తుతం జరిగిన ఒప్పందం ద్వారా ఇక్కడి యువతరంలోని నైపుణ్యతకు అంతర్జాతీయ స్ధాయి శిక్షణ తోడవుతుందని తెలిపారు. ఈ స్కూల్ ఏర్పాటు ద్వారా ప్రపంచ స్థాయి బ్రాండ్లకు యానిమేషన్, వియఫ్ ఏక్స్ రంగాల్లో సేవలు అందించేందుకు అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ రంగంలో అంతర్జాతీయ స్ధాయి విద్య అందుబాటులోకి వస్తుందన్నారు.
కాగా, ఈ ఒప్పందం మేరకు హైదరాబాద్ నగరంలో ఒక సాటిలైట్ క్యాంపస్ ను ఈ ఫిల్మ్ స్కూల్ నెలకొల్పుతుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలో యానిమేషన్, గేమింగ్, వియప్ ఏక్స్, వంటి రంగాల్లో అభివృద్దికి వాంకువర్ ఫిల్మ్ స్కూల్ సహాకరిస్తుంది. రాష్ట్ర ఇమేజ్ పాలసీలో పేర్కొన్న రీతిలో రాష్టంలో గేమింగ్ రంగాభివృద్దికి అంతర్జాతీయ స్ధాయిలో ఒక సంస్ధను ఏర్పాటుచేస్తామన్న ప్రభుత్వ ప్రయత్నం ఈ ఎంఓయూ ద్వారా నెరవేరనుంది. ఈ క్యాంపస్ ద్వారా గేమింగ్,యానిమేషన్, వియఫ్ ఏక్స్ వంటి రంగాల్లో పలు కోర్సులన ప్రవేశ పెట్టడంతోపాటు, విద్యార్దులకు నైపుణ్యాభివృద్దిలో సహాకారం అందిస్తుంది.
Post Views: 214