కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయిన జేసీ బ్రదర్స్ అరాచకాలు రాను..రాను మితి మీరుతున్నాయి. ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యక్షంగా.. పరోక్షంగా తన అనుచరులతో అనంతపురం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడ్డొస్తే హత్యలు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, అక్రమ వసూళ్లు, మట్కా కేంద్రాలు, బెదిరింపులు, నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్.. ఇలా చెప్పుకోవాలంటే జేసీ బ్రదర్స్ అరాచకాలు అనేకం. ఓ వైపు చంద్రబాబు అండ.. మరో వైపు ఏం చేసినా అడిగేవారెవరున్నారన్న ధీమాతో అన్నతమ్ముళ్లు ఇద్దరూ విర్రవీగుతున్నా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలేమైతే తనకేంటీ.. నాకు కేడర్ ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అనంత ప్రజలే అంటున్నారు.
జేసీ బ్రదర్స్ అరాచకలు సొంతూరును సైతం వదల్లేదు. జేసీ బ్రదర్స్ సొంతూరైన జూటూరులో భయపెట్టి, వేధింపులకు గురిచేసి మరీ రైతుల నుంచి తక్కువ ధరకే భూములను స్వాధీనం చేసుకున్నారు. వీరి మాట వినకపోతే వారు సామాన్య ప్రజలా!.. ప్రభుత్వ అధికారులా! అని చూడకుండా బెదిరింపులకు పాల్పడటమే కాకుండా.. హత్యలు చేసేందుకు కూడా వెనుకాడరని అనంతపురం ప్రజలే అంటున్నారు. అంతేగాక, బ్రోకర్లను సైతం నియమించుకుని అభివృద్ది పేరుతో ప్రజా ధనాన్ని దండుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అసమ్మతి గళం వినిపిస్తున్న వారిని కేసులతో భయపెడుతున్నారు. తాడిపత్రి పట్టణాభివృద్ధి పేరిట గ్రానైట్ యాజమాన్యాల నుంచి కప్పం డిమాండ్ చేశారని, వారు కట్టకపోవడంతో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి మరీ ఇబ్బందులు పెడుతున్నారని తాడిపత్రి గ్రానైట్ యాజమాన్యం వాపోతున్నారు. పట్టణంలో ఎక్కువగా మాట్కా కంపెనీలు జేసీ సోదరుల అండతోనే నడుస్తుండటం గమనార్హం. అయితే, తాజాగా జేసీ వివాకర్‌రెడ్డి అరాచకం మరొకటి వెలుగులోకి వచ్చింది. అయితే, తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ ఆధ్వర్యంలో హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ నడుస్తున్న విషయం తెలిసిందే. అలాగే, జాతీయ రహదారులకు, రాష్ట్ర రహదారులకు ప్రజల నివాసాలకు దూరంగా.. 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం కూడా తెలిసిందే.
ఇదే విషయంపై .. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్దంగా నివాసాల మధ్య ఇబ్బందికరంగా ఉన్న మద్యంషాపును తొలగించాలంటూ వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ సోదారులు తన అనుచర వర్గంతో బార్ అండ్ రెస్టారెంట్‌ను తొలగించాలంటూ ధర్నా చేస్తున్న వైసీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారు. దీనికితోడు టీడీపీ నేతలు కూడా జేసీ సోదరులకు తోడవడంతో తాడిపత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇంకెప్పుడైనా బార్‌ను తొలగించాలంటూ ధర్నా చేస్తే దాడులు తీవ్రంగా ఉంటాయని పోలీసుల ముందే టీడీపీ నేతలు హెచ్చరించడం గమనార్హం. జేసీ బ్రదర్స్ చేస్తున్న అరాచకాలు స్వయానా చంద్రబాబుకు తెలిసినా కూడా నోరు మెదపకపోవడంపై అనంత ప్రజలు పెదవి విరుస్తున్నారు.