తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. సినీ క్రిటిక్ కత్తి మహేష్ మధ్య పోరు సోషల్ మీడియా నుండి ఒక ప్రముఖ చానల్‌కి ఎక్కింది. అసలు మొదట పవన్ ప్యాన్స్‌కి- కత్తికి మధ్య మొదలైన రగడ.. జబర్ధస్త్ స్కిట్‌లలో కత్తి పై పొట్ట నెత్తిమీద బట్ట.. అంటూ హైపర్ ఆది సెటైర్లు వేయడంతో మరోసారి ఆ విషయం పై అగ్గి రాజుకుంది.
దీంతో కత్తి మహేష్‌తో ఓ ప్రముఖ చానల్ డిబేట్ నిర్వహించగా హైపర్ ఆది పై మండి పడ్డారు. అయితే ఆ డిబేట్ జరిగిన తర్వాత హైపర్ ఆదితో దిగిన ఫొటో ఒకటి పోస్ట్ చేసిన కత్తి మహేష్ మరో కాంట్రవర్సిటీకి తెరలేపారు. దీంతో ఈ సారి హైపర్ ఆదిని లైవ్‌లోకి పిలిచింది.. ఆ ప్రముఖ చానల్. కత్తి మహేష్‌ని ఫోన్ ద్వారా లైవ్ లోకి తెచ్చింది.
అయితే హైపర్ ఆది- కత్తి మహేష్ మధ్య వాడి-వేడి చర్చ జరిపి టీఆర్పీ పెంచుకుందామనుకున్న ఆ ప్రముఖ చానల్ పరువు తీసాడు హైపర్ ఆది. సదరు యాంకరమ్మ కత్తి మహేష్ తో ప్రాబ్లం ఏంటని అడుగగా.. ఆ ప్రాబ్లం పక్కన పెట్టి.. మొన్న ఏపీలో కృష్ణా నది బోటు ప్రమాదం జరిగింది.. 23 మంది చనిపోయిన బోటు విషయం పక్కన పెట్టి పోట్ట వాడి నెత్తి మీద బట్ట పై గంట సేపు డిబేట్ ఎలా పెట్టారని అడుగడంతో.. ఆ యాంకరమ్మ ఒక్కసారిగా షాక్ తిని టాపిక్‌ని డైవర్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రముఖ చానల్ పై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.