సినీ విమర్శకుడు మహేష్ కత్తి.. హైపర్ ఆది మధ్య వార్ సోసల్ మీడియా సాక్షగా ముదురుతోంది. పవన్ ఫ్యాన్స్- కత్తి మధ్య జరుగుతున్న టైమ్‌లో.. హైపర్ ఆది తన స్కిట్‌లో కత్తి పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. దీంతో న్యూస్ చానల్కికి ఎక్కిన కత్తి తన ఆవేధనను వెళ్ళగక్కన సంగతి తెలిసిందే. అయితే తన స్కిట్‌లను పంచ్‌లతోనే నడిపించే ఆది కత్తి పొట్ట పై బట్ట పై సెటైర్లు వేయడం కరెక్ట్ కాదని.. అభిమానులు కూడా చర్చించుకున్నారు.
అయితే మహేష్ కత్తి మాత్రం హైపర్ ఆదితో ఫొటో దిగి.. అభిమానులే వెధవలు మేమంతా ఒకటే.. అని పోస్ట్ పెట్టాడు. దీంతో లైన్‌లోకి వచ్చిన హైపర్ ఆది సోషల్ మీడియాలో కత్తికి షాక్ ఇచ్చాడు. మేమూ మేమూ బాగుంటాం. విభేదాలు ఉంటాయి. మధ్యలో ఫ్యాన్సే వెధవలు అన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే నేను కూడా ఫ్యానే కాదా..ఇంతకీ కత్తి మహేశ్ ఎవర్ని అన్నట్టు.. నాతోనే ఫొటో దిగి నన్నే వెధవ అని అంటావా.. అని మహేష్ కత్తి పై ఫైర్ అయ్యాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ పై పెద్ద రచ్చే జరుగుతోంది.