హైదరాబాద్ నగరంలో మరో సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది.ఇటీవలో కేపీహెచ్‌బీ ఓ సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించిన విషయం తెలిసిందే.దాన్నిమరవక ముందే తాజాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేశారు. నలుగురు నిర్వాహకులతో పాటు విటులను అరెస్టు చేశారు.కూకట్పల్లి 6వ ఫేజులో వ్యభిచారం జరుగుతుందనే సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన యువతితోపాటు పలువురు విటులను అదుపులోకి తీసుకున్నారు.నిందితుల దగ్గర నుంచి రూ.లక్షా 32 వేల నగదు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని ఫోన్ ద్వారా విటులకు గాలం వేస్తున్నారని పోలీసులు గుర్తించారు.వ్యభిచార గృహంపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
