తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గత నెల అక్టోబర్ 27న మొదలై ఈ రోజు నవంబర్ 17న ముగిశాయి .దాదాపు పదహారు రోజుల పాటు సమావేశాలు జరిగాయి .ఈ సమావేశాల్లో అరవై తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు సభ కొనసాగింది .సభలో మొత్తం పదకొండు అంశాలపై చర్చ జరగగా పదకొండు బిల్లులకు ఆమోదం తెల్పింది .
ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు ప్రకటనలు చేశారు .సమావేశాల్లో భాగంగా హరితహారం,గుడుంబా నిర్మూలన – పునరావాసంపై , రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధర, కేసీఆర్ కిట్ల,భూ రికార్డుల ప్రక్షాళన, మైనార్టీ సంక్షేమం,రైతులకు 8వేలు పెట్టుబడి సాయం, రైతు సమన్వయ సమితులు, నిరుద్యోగ సమస్య, గురుకుల పాఠశాలలు, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు,ఫీజు రి ఎంబెర్స్ మెంట్,పాలనా సంస్కరణలు పై లఘుచర్చ జరిగింది .
పీడీ యాక్ట్ సవరణ, పట్టాదారు పాస్ పుస్తకాలు, వ్యాట్ సవరణలు-2,గేమింగ్ ,ఎక్సైజ్,షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, లోకాయుక్త, అధికార భాషా, ధార్మిక బిల్లులను ఆమోదించించడం జరిగింది . 24 గం. విద్యుత్ సరఫరా,చేనేత పరిశ్రమ-కార్మికులు, ప్రపంచ తెలుగు మహాసభలు, మృతి చెందిన ఎమ్మార్పీఎస్ నేతకు 25లక్షలు లాంటి ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ ..