దేశంలో కామంధులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు. ఎక్కడో ఒక్క చోట ఖచ్చితంగా మహిళలపై దారుణంగా అత్యాచారలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రోడ్డు ప్రమాదంలో అత్త మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అత్తింటికి వచ్చిన అల్లుడు స్వయానా మరదలిపైనే అత్యాచారం జరిపిన దారుణ ఘటన ముంబయి నగరంలోని ఖర్ ప్రాంతంలో వెలుగుచూసింది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ కు చెందిన 24 ఏళ్ల యువకుడు అత్త రోడ్డుప్రమాదంలో మరణించిందని భార్యతో కలిసి ముంబయి నగరంలోని ఖేర్ ప్రాంతంలో ఉన్న అత్తింటికి వచ్చాడు. అత్త అంత్యక్రియలు పూర్తయ్యాక బావ అత్తింట్లో ఉన్న పదహారేళ్ల మరదలిపై కన్నేశాడు. రాత్రి కాగానే మరదలు నిద్రపోతుండగా ఆమెపై అత్యాచారం చేశాడు. కామాంధుడైన బావ అడ్డుకోబోయిన భార్యను కొట్టి గదిలో బంధించి మరదలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇరుగుపొరుగువారికి సంఘటన గురించి చెప్పి వారి
సాయంతో బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఖేర్వాడీ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, 323,506, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
