హెచ్1బీ..అమెరికా ఇచ్చిన తాజా షాక్ ఇది
వలసవాదుల దేశంలో భూమిపుత్రుల పేరిట విపరీత ధోరణులకు శ్రీకారం చుట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన షాకుల పరంపరలో మరో దుర్వార్తను వినిపించారు. మన దేశ టెకీలకు సువర్ణ అవకాశం కల్పించే హెచ్1బీ వీసా జారీ చేస్తూ గతంలో ట్రంప్ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ తదుపరి…హెచ్-1బీ వీసా జారీ నిబంధనలు కఠినం చేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా కాంగ్రెస్‌కు చెందిన అతున్నత స్థాయి సంఘం ఆమోదముద్ర వేసింది.
తాజా మార్పులు చట్టంలోకి రావాలంటే తొలుత ప్రతినిధులు సభ సభ్యులు, తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తే దాన్ని చట్టంలోకి తీసుకొస్తారు. ఈ చట్ట ప్రకారం హెచ్-1బీ వీసాలపై వస్తున్న నిపుణులకు ఇస్తున్న వేతనాన్ని కంపెనీలు 60వేల డాలర్ల నుంచి 90వేల డాలర్లకు పెంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా హెచ్1బీ వీసాలపై ఆధారపడి పనిచేసే కంపెనీలకు కూడా అనేక రకాల షరతులు వర్తించనున్నాయి. అమెరికన్ల స్థానంలో హెచ్1బీ వీసాదారులను నియమించే విధానాన్ని ఈ చట్టం అడ్డుకుంటుంది.