సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు .శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి కాలరీస్‌లో నూతన బొగ్గు గనుల ఏర్పాటుపై సీఎం వివరణ ఇచ్చారు.సింగరేణిలో త్వరలోనే 12 కొత్త గనులు ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 12 గనుల్లో ఆరు అండర్ గ్రౌండ్ మైన్స్ కాగా, మిగతావి ఓపెన్ కాస్ట్ గనులు అని సీఎం చెప్పారు. సింగరేణిలో నైపుణ్యాభివృద్ధికి కేంద్రంను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాలను మూడు చోట్లు పెట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. సింగరేణిలో 12 వేల ఉద్యోగాలను కల్పిస్తున్నామన్న సీఎం.. ఇప్పటికే కొంతమందిని రిక్రూట్ చేసుకున్నామని స్పష్టం చేశారు.