ప్రజాసంకల్పయాత్రలో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్‌ను 10వ రోజు పాదయాత్ర ప్రారంభమైన కొద్దినిమిషాల్లోనే ….స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలు జగన్ కి చెప్పుకున్నారు. ఆళ్లగడ్డ వైపీఎం హైస్కూల్ విద్యార్థినులు కూడా వైఎస్ జగన్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. వర్షం వస్తే తరగతి గదుల్లో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వసతి లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థినులు వాపోయారు. మాకు ఓటు హక్కు లేదని ..అందుకే మా సమస్యలు అఖిలమ్మకు కనిపించడంలేదని వివరించారు. వీరి సమస్యలను విన్న జగన్ పాఠశాలలో మౌలిక వసతులపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. సర్కార్ స్పందించకుంటే తాము అధికారంలోకి వచ్చాక మౌలిక వసతులు కల్పిస్తామని జగన్ తెలిపారు. అలాగే దారిపొడవునా ఎదురైన ప్రజలందర్నీ పలకరించుకుంటూ…వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారు. రైతులు, యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని……త్వరలోనే మంచిరోజులొస్తాయని భరోసా కల్పిస్తున్నారు.
