ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న పద్మావతి మూవీ రిలీజ్‌ను నిరసిస్తూ ఇప్పటికే డిసెంబర్ 1న భారత్ బంద్ ప్రకటించిన రాజ్‌పుత్ కర్ణిసేన తాజాగా ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న దీపికా పదుకొనేను బెదిరించింది. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. శూర్పనక ముక్కులాగా దీపికా పదుకొనే ముక్కు కూడా కోసేస్తాం.
వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తాడని పేరున్న సంజయ్ లీలా భన్సాలీ ఈ మూవీని అలాగే చిత్రీకరించాడు. సినిమాకు దుబాయ్ నుంచి పెట్టుబడులు అందాయి. సినిమా రిలీజ్‌ను కచ్చితంగా అడ్డుకుంటాం అని ఆ గ్రూప్ నేత లోకేంద్ర సింగ్ కల్వి హెచ్చరించారు. దేశం దిగజారిపోతున్నదన్న దీపికా కామెంట్స్‌పై ఆయన ఇలా స్పందించాడు. దేశం కాదు మీరు అలా దిగజారిపోయేలా చేస్తున్నారు. మహిళలను అవమానపరచొద్దని దీపికాను కోరుతున్నాం. ఈ సినిమాలో ఒంటిపై కొన్ని దుస్తులతోనే డ్యాన్స్ చేయడం కనిపించింది. భారతీయ మహిళను ఇలా ఎలా చూపించగలుగుతారు అని కల్వి ప్రశ్నించారు.