తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి మీద అత్యల్ప మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే .అయితే ,ఈ సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలవడానికి ప్రధాన కారణం ఏమిటో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన ప్రస్తుత నల్గొండ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ అయిన భూపాల్ రెడ్డి తెలిపారు .
ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక ఓటర్లు కన్ ప్యూజ్ కావడం వలనే తానూ ఓడిపోయినట్లు ఆయన తెలిపారు .ఆ ఎన్నికల సమయంలో ఎంపీ ఓటు హస్తం గుర్తుకు ,ఎమ్మెల్యే ఓటు తన గుర్తు ఆటోకు వేయాలని ఓటర్లు భావించారు .కానీ కన్ ప్యూజన్ వలన ఎమ్మెల్యే బ్యాలెట్ లోనూ హస్తం గుర్తుకే ఓట్లేశారు .అందువలన అత్యల్ప మెజారిటీతో కోమటిరెడ్డి తనపై గెలుపొందారు అని అన్నారు .కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తనదే అని ..రానున్న ఎన్నికల్లో తనపై పోటి చేసే ధైర్యం కోమటిరెడ్డికి లేదన్నారు .