భారతదేశాన్ని ఆంగ్లేయుల చెర నుండి కొట్లాడి మరి పోరాటం చేసి విముక్తి కల్గించిన జాతిపిత మహాత్మాగాంధీజీను నాదురాం గాడ్సే కాల్చి మరి హతమార్చిన సంగతి తెల్సిందే .అయితే ప్రముఖ హిందూత్వ సంస్థ అయిన అఖిల భారతీయ హిందూ మహాసభ హంతకుడైన నాదూరం గాడ్సే కు ఘననివాళి అర్పించింది .
గాడ్సే వర్ధంతి సందర్భంగా గురువారం గ్వాలియర్ లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి మరి గాడ్సే అర్ధ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసింది .అంతే కాకుండా ఆయనకు గుడి కట్టినట్లు కూడా ప్రకటించింది . కానీ అంతకుముందిగ్వాలియర్‌లో నాథూరాం గాడ్సేకు గుడి కట్టేందుకు హిందూ మహాసభ ప్రయత్నించగా.. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం అనమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో 32 అంగుళాల పొడవున్న గాడ్సే విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన హిందూ మహాసభ.. ఆయనకు గుడి కట్టాలన్న తమ అభ్యర్థనను జిల్లా యంత్రాంగం నిరాకరించిందని, అయినప్పటికీ తమ సొంత స్థలంలో గాడ్సే విగ్రహం ఏర్పాటుచేసి.. గుడి కట్టామని తెలిపింది. మహాసభకు చెందిన సొంత స్థలంలో గుడి కట్టినందున దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని
మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ అనడం విశేషం ..