తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సొంతం చేసుకుంది. ఇండియా టుడే అందిస్తున్న 2017 స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో పురస్కారాలు అందుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ-స్వచ్ఛత విభాగాల్లో ఈ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జోగు రామన్న అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ పాల్గొన్నారు.
మరికాసేపట్లో పోటీ సమాఖ్యలో రాష్ట్రాల పురోగతి అంశంపై మంత్రి కేటీఆర్ మాట్లాడనున్నారు. వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి, అందుకోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంస్కరణలను మంత్రి కేటీఆర్ వివరించనున్నారు. స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ 2017 లో భాగంగా ఇవ్వనున్న 10 అవార్డులలో తెలంగాణ కు దక్కిన రెండు అవార్డులు రాష్ట్ర ప్రగతికి అద్దం పడుతున్నాయని వివరించారు.
Tags MINISTER KTR telangana