అటు బుల్లితెరపై.. ఇటు వెండి తెరపై యువతకు కిక్ ఇచ్చే యాంకర్, నటి ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు రష్మీ. జబర్దస్త్ పుణ్యమా అంటూ వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకుంటూ తను ఇంటర్వ్యూలు చేసే స్థాయి నుంచి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈ హాట్ యాంకర్ రష్మీ. అందులోను తను నటించిన చిత్రాలు కూడా వరుసగా విజయాలు సాధిస్తుండటంతో తన అందాల ఆరబోతకు హద్దులను చెరిపేసింది రష్మీ. బుల్లితెరను, వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ నిత్యం అభిమానులకు దగ్గరవుతూ యాంకర్ కమ్ యాక్టర్ అంటూ ప్రశంసలందుకుంటోంది.
రష్మీ తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అయిన మాట ఎంత వాస్తవమో.. అదే స్థాయిలో రష్మీపై గాసిప్స్ వచ్చాయన్న మాట కూడా అంతే వాస్తవం. మొన్నటికి మొన్న బ్రహ్మాజీ రష్మీ మధ్య ఎఫైర్ అంటూ పలు వార్తలు షికార్లు చేశాయి. అంతకు ముందు సుధీర్ రష్మీ పెళ్లి కూడా చేసేసుకున్నారంటూ వార్తలు కూడా గుప్పుమన్నాయి. తీరా అన్ని పుకార్లేనని తేల్చేశారు బ్రహ్మాజీ, సుధీర్, రష్మీ.
అయితే, తాజాగా హాస్య నటుడు ఆలీ యాంకర్ టెలికాస్ట్ అవుతున్న ప్రోగ్రామ్‌లో పాల్గొన్న రష్మీని ప్రదీప్, రవి, చంటి, సుధీర్, ఈ నలుగురి యాంకర్లకు వందకు ఎన్ని మార్కులు ఇస్తావు అని ప్రశ్నించగా.. ప్రదీప్‌కు 100, రవి – 50, చంటి – 60, సుధీర్ – 10 మార్కులు ఇచ్చింది. సుధీర్‌కు పది మార్కులే ఎందుకిచ్చావని యాంకర్ ప్రశ్నించగా.. సుధీర్ నా జానీ దుష్మంత్ అంటూ కితాబిచ్చింది. మాకిద్దరికీ ఎప్పుడూ టిఫ్ ఉంటుంది. నేను వందకు వంద అని చెప్పినా సరే సుధీర్ అది అబద్ధం అనుకుంటాడు.
అయినా.. ఇప్పుడే కదా సుధీర్ యాంకరింగ్ మొదలు పెట్టింది.. ఇప్పుడే వందకు వంద ఇస్తే .. నెత్తికెక్కుతాడు. అప్పట్లో సుధీర్‌కు యాంకరింగ్ చేసేంత విషయం లేదనుకున్నానని, కానీ, ఇప్పుడు అద్భుతంగా చేస్తున్నాడంటూ తనదైన శైలిలో జవాబిచ్చింది యాంకర్ రష్మీ. అలాగే ఫీమేల్స్లో రోజాకు 100, అనసూయకు 99, శ్రీముఖికి 98, తనకైతే 100 మార్చులు ఇచ్చుకుంటానని చెప్పింది ఈ హాట్ యాంకర్ కమ్ నటి రష్మీ.