తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి ఇంటికి నల్లాద్వారా సమృద్ధిగా తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పట్టణ భగీరథ పథకం ఫలాలు విరివిరిగా అందుతున్నాయి. ఇప్పటికే ఏడుచోట్ల భారీ స్టోరేజీ రిజర్వాయర్లను ప్రారంభించి ప్రజల గొంతును తడిపిన జలమండలి.. ఈ నెల 26వ తేదీన గడ్డిఅన్నారం, ఎల్బీనగర్ తదితర సర్కిళ్ల పరిధిలోని మరో 20 రిజర్వాయర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా ఓకేచోటి నుంచి వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తర్వాత సంబంధిత నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు రిజర్వాయర్లను ప్రారంభిస్తారు.
జీహెచ్‌ఎంసీలో విలీనమైన శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, కాప్రా, ఉప్పల్, ఎల్బీనగర్, ఆర్‌సీపురం, పటాన్‌చెరు కలిపి 10 మున్సిపల్ సర్కిళ్ల ప్రజల దాహార్తికి శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం రూ.1,900 కోట్ల హడ్కో నిధులతో తాగునీటి ప్రాజెక్టును చేపట్టింది.రోజూ 146 మిలియన్ గ్యాలన్ల (55.2 కోట్ల లీటర్ల) నీటిని సరఫరా చేయడంతోపాటు కొత్తగా లక్ష నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. దీంతో 35 లక్షల మందికి రక్షిత తాగునీరు అందనున్నది. ఈ మేరకు 1,800 కిలోమీటర్ల మేర పైపులైన్, 56 చోట్ల భారీ స్టోరేజీ రిజర్వాయర్లను ఏర్పాటు చేయాలని జలమండలి నిర్ణయించింది.దీంతో డి