Home / ANDHRAPRADESH / టీడీపీ ప్రభుత్వంపై మండి పడుతున్న సీని రంగం

టీడీపీ ప్రభుత్వంపై మండి పడుతున్న సీని రంగం

ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల కేటాయింపులో సినీ రంగంలో ఒక వర్గానికి చెందిన వారికే ప్రయోజనం చేకూరిందని విమర్శలు వస్తున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి సినీ నిర్మాతల వరకు నంది అవార్డులను ప్రకటించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే నిర్మాత బన్నీ వాసు, దర్శకనిర్మాత గుణశేఖర్ తమ అసహనాన్ని వెల్లబుచ్చారు. తాజాగా ఆ ఖాతాలో నిర్మాత బండ్ల గణేశ్ చేరారు. అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని బండ్ల గణేశ్ అన్నారు. అవి నంది అవార్డులు కాదని.. సైకిల్ అవార్డులను వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బుధవారం రాత్రి ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన బండ్ల గణేశ్.. టీడీపీ ప్రభుత్వంపై, నంది అవార్డుల జ్యూరీపై విరుచుకుపడ్డారు. ‘మెగా ఫ్యామిలీని పట్టించుకోవడం లేదనే విషయం ఈ అవార్డుల ప్రకటనలో స్పష్టంగా తెలిసిపోయింది. అవార్డులు చూస్తే చాలా కామెడీగా అనిపించింది. పేపర్ చూడగానే వన్డే ఎంటర్‌టైన్‌మెంట్‌లా అనిపించింది. వాళ్ల ఇంట్లో్ వాళ్లకి, వాళ్ల అన్నలకి, తమ్ముళ్లకి, టీడీపీ పార్టీ జెండా కోసం పనిచేసే వాళ్లకి ఇచ్చినట్లుగా ఉంది. మెగా ఫ్యామిలీకి అన్యాయం జరగడం ఇదేమీ కొత్తకాదు. అది అలవాటుగా మారిపోయింది. నా సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’లో చరణ్ అద్భుతంగా నటించాడు. కానీ అతనికి అవార్డు రాలేదు’ అని బండ్ల గణేశ్ వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ పై ఇంక ఎంతమంది ఎన్ని మాటలు…ఎన్ని విమర్శలు వస్తాయో మరి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat