నాణ్యమైన విద్యతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గౌడ్ అన్నారు . అసెంబ్లీలో గురుకుల పాఠశాలలు, కాలేజీల ఏర్పాటుపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ … దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. ప్రతీ నియోజకవర్గంలో బీసీ గురుకులాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. బీసీల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నరని వివేకానంద కొనియాడారు. మైనార్టీ కోసం గురుకులాలు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. నియోజకవర్గానికి ఒక బీసీ గురుకులం ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షదాయకమన్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.84 వేలు ఖర్చు చేస్తున్నదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా ఉందన్నారు.
