తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఈత, తాటి చెట్లను నాటారు..ఆ చెట్ల నుంచి ప్రకృతి సిద్ధంగా తీసిన నీరా పానీయం క్రయవిక్రయాలకు తీసుకుంటున్న చర్యల గురించి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నోత్తరాల సమయంలో శాసన సభలో అడిగారు. ఈ ప్రశ్నలకు మంత్రి పద్మారావు సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు కోటీ 69 లక్షలకు పైగా ఈత చెట్లను నాటామని మంత్రి తెలిపారు. ఈత చెట్లను సంరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. గీత కార్మికులకు రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు.