కత్తి మహేష్ ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినబడుతున్న పేరు .నిన్న మొన్నటి వరకు క్రిటిక్‌గా ఉన్న మహేష్ బిగ్ బాస్ షోతో సెలబ్రిటీగా మారాడు. ఆ తర్వాత ఈయన పవన్ కళ్యాణ్‌పై కొన్ని కామెంట్స్ చేయడం, అభిమానులు కత్తి మహేష్‌పై దూషణకి దిగడం, ఈ క్రమంలో ఈ వివాదంపై పలు ఇంటర్వ్యూలు ఇస్తూ కత్తి మహేష్ ఫుల్ పాపులర్ అవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి.
అయితే ఈ మధ్య జబర్ధస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది ‘పెళ్లి అనేది మనం సినిమా తీసినంత కష్టం కానీ ప్రేమ అనేది ముందు పొట్ట, వెనక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ’ అంటూ పంచ్‌లు విసిరాడు. ఇవి తనని ఉద్దేశించే చేశాడని కత్తి మహేష్ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. అయిన నాపై కామెంట్స్ నేనెప్పుడు పట్టించుకోను అని కత్తి మహేష్ స్పష్టం చేశాడు. శరీరాకృతిపై పంచ్‌లు వేసి నవ్వించడం అనేది కళాకారుల లక్షణం కాదంటూ ఘాటుగానే స్పందించాడు.
ఈ నేపథ్యంలోకత్తి మహేష్ తాజాగా తన ఫేస్ బుక్‌లో హైపర్ ఆదితో కలిసి దిగిన ఫోటో షేర్ చేశాడు. ఇందులో అందరు నవ్వుతూ
కనిపిస్తున్నారు. ఇక ఆ ఫోటోకి కామెంట్ కూడా పెట్టాడు. ’కలిస్తే మేమూ మేమూ బాగానే ఉంటాం. విభేదాలు విషయాలకు సంబంధించి, పరిస్థితులకు లేదా సిద్ధాంతాలకు సంబంధించి ఉంటాయేగాని, వ్యక్తిగత వైరాలు ఉండవు. ఆ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే పిచోళ్ళు నానా రభసా చేసి, వాళ్ళ జీవితాలు సంకనాకించుకుంటారు. మేలుకొండ్రా నాయనా! రేపోమాపో పవన్ కళ్యాణ్ ని కలిసినా ఇలా నవ్వుతూ ఫోటో దిగగలను. తరువాత వెధవలు అయ్యేది మీరే!’ అని ఆయన తాజాగా ఫేస్బుక్లో పోస్టు చేశారు.