టాలీవుడ్ టు హాలీవుడ్ వరకు బోల్డ్ స్టేట్‌మెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే నటీమణుల్లో హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ ఒకరు. ఒకానొక సమయంలో హీరోయిన్ల విషయంలోనూ అదే స్థాయిలో బోల్డ్‌గా స్టేట్‌మెంట్లు ఇచ్చి టాక్ ఆఫ్‌ద ఇండస్ర్టీగా మారింది. ఆ సమయంలో సినిమా నిర్మాతలు హీరోయిన్లతో శృంగారం కోసం ఆసక్తి చూపిస్తుంటారని, ధనవంతలు సినిమా నిర్మాతలుగా మారడానికి కారణం కూడా అదేనంటూ… దాన్ని ఆశించే అందమైన అమ్మాయిలను హీరోయిన్లుగా పెట్టి సినిమాలను చిత్రీకరిస్తుంటారని మీడియాతో చెప్పుకొచ్చింది కూడా. ఇలా ఓ పక్క హాట్ కామెంట్స్ చేస్తూనే మరోపక్క అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు హీటెక్కించే ఫోటో షూట్‌ను ఆన్‌లైన్‌లో పెడుతుంటోంది ఈ హాట్ భామ.
అయితే, తాజాగా ఈ హాట్ భామ మరోసారి వార్తల్లోకెక్కింది. కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి సారధ్యంలో చిత్రీకరిస్తున్న లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలో తాను నటించడం లేదంటూ బాంబ్ పేల్చింది. కాగా, లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంలో లక్ష్మీపార్వతి రోల్ కోసం లక్ష్మీరాయ్‌ని తీసుకునేందుకు నిర్ణయించామని, ఇందుకు సంబంధించి ఆమెను కలిసి మాట్లాడామని, కథ విన్న వెంటనే లక్ష్మీరాయ్ ఓకే చెప్పేసిందని టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
అయితే, ఈ విషయంపై తాజాగా స్పందించిన లక్ష్మీరాయ్.. లక్ష్మీస్ వీరగ్రంథంలో తాను నటించడం లేదంటూ షాక్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అసలు ఆ చిత్రానికి సంబందించి ఎవరూ తనను కలవలేదని, అలాంటప్పుడు ఆ చిత్రంలో చేసేందుకు నేనెలా ఒప్పుకుంటానంది. ఈ చిత్రంలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు చూసి షాక్‌కు గురయ్యానంటూ మీడియాతో చెప్పుకొచ్చింది ఈ హాట్ భామ. ఏదేమైనా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్‌గా వస్తున్న లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంలో లక్ష్మీ పార్వతి రోల్‌లో నటిస్తే అటు రాజకీయ పరంగా ఇబ్బందులు వస్తాయనే భయంతో ఈ హాట్‌భామ ఓకే చెప్పి ఉండదని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.