కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టుగా, కొత్త పార్టీ పెడుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ పటిష్టతకు పనిచేస్తానన్నారు.కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానని, పీసీసీ అధ్యక్ష పదవి అడిగితే తప్పేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో అందరూ పీసీసీ, సీఎం పదవికోసం ప్రయత్నిస్తున్న వారేనని అన్నారు.40 నుంచి 50 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు. ఒకవేళ వారిని మార్చకపోతే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.
