తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత మూడున్నర ఏండ్లుగా ప్రజాసంక్షేమం కోసం ,విభిన్న వర్గాల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను ,పథకాలను అమలుచేస్తూ కొట్లాడి మరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నారు .ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలు పాటు పాలకులు పరిష్కరించలేని సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన మూడున్నర యేండ్లలో పరిష్కరించి ఒక ముఖ్యమంత్రి ,ప్రజల సమస్యలు తెల్సిన నేత ఎలా ఉండాలో దేశానికి చాటి చెప్పారు .అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ పక్కనే ఉన్నాకాని త్రాగడానికి గుక్కెడు నీళ్ళు లేక ప్లోరిసిస్ ప్రాంతంగా పేరుగాంచిన జిల్లా నల్గొండ .
జిల్లాలో మొత్తం మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో నలబై శాతం గ్రామంలో 1పీపీఎం ను మించి ప్లోరిసిస్ మోతాదు ఎక్కువగా ఉంది .ముఖ్యంగా మునుగోడు నియోజక వర్గంలో మర్రిగూడెం ,నాంపల్లి మండలాల్లో అత్యధికంగా ఇరవై శాతం వరకు ఉండటం గమనార్హం ..అయితే ,ఎన్నో పోరాటాలు ..మరెన్నో ఉద్యమాల తర్వాత ఏర్పడిన స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన కార్యక్రమం మిషన్ భగీరథ .దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి నీళ్ళు అందిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాను లేకపోతే ఓట్లు అడగను అని తేల్చి చెప్పిన దేశంలోనే మొట్ట మొదటి నేత కేసీఆర్ .
అందులో భాగంగా రాష్ట్రంలో ప్లోరిసిస్ ప్రాంతంగా ఉన్న నల్గొండలో ఈ మహమ్మారిని తరిమికొట్టే ప్రయత్నంలో భాగంగా జిల్లాలో బట్లపల్లి గ్రామంలో మొత్తం నాలుగు వందల కోట్ల ముప్పై ఆరు రూపాయలతో ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులను ఇప్పటికే తొంబై శాతం పూర్తిచేశారు .ఆరు మండలాల్లో వచ్చే డిసెంబర్ లోపు పనులు పూర్తీ కానున్నాయి .జిల్లాలో ఎక్కువగా పీడత ప్రాంతంగా ఉన్న మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గంలో అధిక నిధులను కేటాయించి పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నారు .అంతే కాకుండా మరో 113.67 కోట్ల రూపాయలతో అంతర్గత పనులను పూర్తిచేస్తున్నారు .మరో కొద్ది నెలలో మిషన్ భగీరథ పనులను పూర్తిచేసి నల్గొండ జిల్లాను కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న ప్లోరిసిస్ సమస్యను పరిష్కరించి దేశానికే ఆదర్శంగా నిలవనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ..