ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ రాష్ట్ర విభాగ అధ్యక్షురాలు ,నగరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా గత మూడున్నర ఏండ్లుగా ఇటు టీడీపీ సర్కారు అవినీతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఇటు అసెంబ్లీ అటు ప్రజాక్షేత్రంలో అలుపు ఎరగని పోరాటం చేస్తూ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ టీంకి కంటిపై కునుకు లేకుండా చేస్తోన్న సంగతి తెల్సిందే .ఒకవైపు ఇటు రాజకీయాల్లో రాణిస్తూనే మరోవైపు ఒక యాంకర్ గా ,ఇల్లాలుగా ,ఒక బాధ్యత కల్గిన గృహిణిగా ఇలా తనదైన స్టైల్ లో విశిష్ట పాత్రనుపోషిస్తున్నారు .ఈ నేపథ్యంలో తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం ఒకవైపు సర్కారు కుట్రలతో ,కుతంత్రాలు చేస్తూ నియోజక వర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్న కానీ తనదైన స్టైల్ లో పోరాడుతూ న్యాయం చేకూరుస్తున్నారు .
ఈ క్రమంలో సోషల్ మీడియా సంచలనం ,ఆన్లైన్ వెబ్ మీడియాలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న దరువు డాట్ కామ్ లో మొట్టమొదటిసారిగా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు లైవ్ కార్యక్రమంలో పాల్గొనున్నారు .వెబ్ సైట్ లైవ్ కార్యక్రమంలోపాల్గొని తన నియోజక వర్గ ప్రజల సమస్యలతో పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బాబు సర్కారు హాయంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను తెల్సుకోని ..వాటిని పరిష్కరించడానికి ఆర్కే రోజా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు .