సినీ నటి భువనేశ్వరి కొడుకు ( మిథున్ శ్రీనివాసన్ ) ను పోలీసులు అరెస్ట్ చేసారు .. అసలు విషయం ఏమిటంటే… మిథున్ లా చదువుతున్నాడు. ఇతనికి స్థానిక అన్నానగర్, తిరుమంగళంలో నివశిస్తున్న ఒక యువతికి ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అనంతరం ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం పెరగడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతిపై ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. అందుకు ఆ యువతి నిరాకరించడంతో మిథున్ శ్రీనివాసన్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి గొడవ చేశాడు.అంతే కాకుండా ఆ యువతి చదివే కళాశాలకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని టార్చర్ వేధించడంతో ఈ విషయాన్ని ఆ అమ్మాలు తల్లిదండ్రులకు చెప్పింది. వారు తిరుమంగళం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి మిథున్ శ్రీనివాసన్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.