Home / SLIDER / సీఎం కేసీఆర్ మానస పుత్రికల ఫలితమే…స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డుః మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మానస పుత్రికలైన పథకాలకు అవార్డులు దక్కడం సంతోషకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రముల, పురపాలక శాఖా మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం ఇండియా టుడే నిర్వహించిన స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాన్ క్లేవ్ 2017 లో తెలంగాణ రాష్ట్రం రెండు అవార్డులను దక్కించుకుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ – స్వచ్చతా విభాగాల్లో తెలంగాణ రాష్ట్రానికి రెండు అవార్డులు లభించాయి. కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ ల మంత్రి కె. తారక రామారావు, పర్యావరణ – అటవీ శాఖల మంత్రి జోగు రామన్న ఈ అవార్డులను అందుకున్నారు.
అనంతరం మంత్రి కే. తారకరామారావు మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మానస పుత్రికలైన పథకాలకు ఈ అవార్డులు దక్కాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం కాదని, తెలంగాణ వస్తే అభివృద్ధిలో వేగంగా అభివృద్ధి చెందుతుందన్న ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు మాటలను ఈ సందర్భంగా మంత్రి మరోసారి గుర్తు చేశారు. దేశంలోనే పెద్ద ఎత్తున హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టి అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలించిందని మంత్రి తెలిపారు.
అనంతరం పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు నేతృత్వంలో కొనసాగుతున్న హరిత హారం కార్యక్రమం దేశంలోనే ఆదర్శవంతమైన పథకంగా కొనసాగుతుందని అన్నారు. నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 34 కోట్ల మొక్కలను నాటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాతం పెంచేలా అనేక ఆలోచనలు చేస్తున్నామని మంత్రి వివరించారు. మూడు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు తీసుకున్న వినూత్న కార్యక్రమాలకు ప్రతిఫలమే జాతీయ స్థాయిలో రాష్ట్రానికి దక్కుతున్న అవార్డులని మంత్రి తెలిపారు. వాతావరణం కాలుష్యం కాకుండా, పాఠశాలలు, ప్రతి ఇంట్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి జోగు రామన్న వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు.