తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని ప్రముఖ ప్రాంతాలు అయిన బంజారాహిల్స్ ,జూబ్లిహిల్స్ ప్రాంతాల్లో రద్దీగా ఉన్న ట్రాపిక్ సమస్యను పరిష్కరించే విధంగా దోహదపడే అన్నపూర్ణ స్టూడియోస్ లింక్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం తనే స్వయంగా ఆ సంస్థ అధినేత ,ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునతో మాట్లాడి పరిష్కరిస్తా అని మంత్రి కేటీ రామారావు స్థానిక వాసులకు హమీచ్చారు .నగరంలోని కృష్ణానగర్ ,జవహర్ నగర్ ,అన్నపూర్ణ స్టూడియోస్ ను అనుకోని ఉన్న రోడ్ల మీదుగా వేసే రోడ్లతో బంజారాహిల్స్ నుండి అమీర్ పేట ,ఎస్ఆర్ నగర్ ,యూసఫ్ గూడ ప్రాంతాలకు వెళ్ళే వారికి మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూరం కలిసి వస్తుంది .అయితే ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ ఇరవై అడుగుల స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకారం తెల్పిన కానీ కనీసం ఎనబై అడుగుల వెడల్పుతో రోడ్డు వేయాల్సి ఉంది అని సంబంధిత అధికారులు తెలిపారు . దీంతో మంత్రి కేటీ రామారావు రంగంలోకి దిగి నాగార్జునతో మాట్లాడతాను అని హామిచ్చారు .తాజాగా ఉన్న జవహర్ నగర్ వరకూ 40 ఫీట్ల రోడ్డు, ఆపై అన్నపూర్ణ స్టూడియో తర్వాత వచ్చే కచ్చారోడ్డు ను మొత్తాన్ని కలుపుతూ 80 అడుగుల రహదారిని రూ. 8 కోట్ల అంచనా వ్యయంతో 100 రోజుల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తామనిమంత్రి తెలిపారు .
