తెలంగాణ వాసులకు మరో శుభవార్త. ముఖ్యంగా నిజామాబాద్ వాసులకు ప్రత్యేక సంతోషకరమైన వార్త. దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న పతంజలి గ్రూప్ వారి ఆహార శుద్ధి కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి లో నిర్మించనున్నారు. నేడు ప్రభుత్వ అధికారుల బృందంతో ఉత్తరఖండ్ లోని హరిద్వార్ వెళ్లిన నిజామాబాద్ ఎంపీ కవిత పతంజలి కేంద్ర కార్యాలయంలో బాబా రాందేవ్, ఆచార్య బాలక్రిష్ణ గార్లతో సమావేశమయ్యారు. అనంతరం ఎంఓయూ పై పతంజలి గ్రూప్ భాద్యూలతో పాటు తెలంగాణ ప్రభుత్వ అధికారులూ సంతకాలు చేసారు.
పసుపు ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో మంచి స్థానంలో ఉండడంతో ఆయుర్వేద మరియు ఆహార ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేస్తున్న పతంజలి గ్రూప్ ను ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేయాల్సిందిగా నిజామాబాద్ ఎంపీ శ్రిమతి కవిత కోరారు. ఎంపీ కవిత గారి ఆహ్వానం మేరకు గత నవంబర్ లో నిజామాబాద్ వచ్చిన పతంజలి గ్రూప్ సీయీఓ ఆచార్య బాలక్రిష్ణ ఇక్కడి పరిస్తితుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం హరిద్వార్ లోని బాబా రాం దేవ్ తో చర్చించి తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యునిట్ ఏర్పాటుకు ప్రాథమికంగా ఎంవోయూ చేసుకునేందుకు అధికారులతో రావలసిందిగా ఎంపీ కవితను కోరారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, టీఎస్ ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహరెడ్డి గారు, నందిపేట్ మండల స్థానిక ప్రజాప్రతినిధులు హరిద్వార్ వెళ్లిన వారిలో ఉన్నారు. అనంతరం హరిద్వార్ లో తమ వస్తూత్పత్తి కేంద్రాన్ని, ప్యాకింగ్ యునిట్లను, పరిశోధనా విభాగాలను, మందుల తయారీ కేంద్రలను శ్రిమతి కవితకు బృందంలోని ఇతర సభ్యులకు చూపించి అక్కడి పద్దతులను వివరించారు.
కాగా, లక్కంపల్లిలో పెద్ద ఎత్తున ఏర్పాటుచేయబోయే ఈ ఆహార శుద్ధి కార్మాగారంలో పసుపు, మిర్చీ, మక్కలు, సోయా తదితర సుగంధ ద్రవ్యాల్ని, తృణ ధాన్యాల్ని సేకరించి శుద్ధి చేస్తారు. అనంతరం శుద్ధి చేసిన ధాన్యాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పతంజలి యునిట్లకు సరఫరా చేస్తారు. దీని వల్ల పతంజలి వారికి కావలసిన పసుపు, మిరప, సోయా, మక్కలు తదీతర నాణ్యమైన ధాన్యాల్ని పెద్ద మొత్తంలో ఒకే చోట దొరుకుతుంది. అదే విధంగా అనేక మందికి ప్రత్యక్షంగా ఈ కార్మాగారంలో ఉపాధి దొరకడంతొ పాటు ఈ ప్రాంత రైతులకు తాము పండించిన ధాన్యాన్ని ఒకేసారి అమ్ముకోవడం వీలవుతుంది. దీంతో పాటు దళారుల చేతిలో మోసపోతున్న రైతులకు నేరుగా కంపెనీయే ధాన్యాన్ని సేకరించడంతో మద్దతు ధర దొరుకుతుంది.
Post Views: 816