ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఆడేసుకుంది. కృష్ణ నది బోటు ప్రమాదానికి వంద శాతం చంద్రబాబే కారణమణి రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు దేవుడి పై అస్సలు ఏమాత్రం భక్తి లేదని.. ఆయన ఎక్కడ పూజలు చేసినా.. కాళ్ళకు బూట్లు వేసుకునే పూజలు చేస్తారని అందుకే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో గోదావరి పుష్కరాల్లో బూట్లు వేసుకుని పూజలు చేసి మొత్తం 29 మంది ప్రాణాలను బలితీసుకున్నారని.. ఇప్పు తాజాగా కృష్ణా పవిత్ర సంగమంలో కూడా బూట్లు వేసుకుని పూజలు చేసి 22 మంది ప్రాణాలను గాలిలో కలిపారని విమర్శించారు. అసలు బాబు పూజలు చేయకపోయినా ఫర్లేదని.. బూట్లు వేసుకుని మాత్రం పూజలు చేయోద్దని రోజా మండి పడ్డారు. దీంతో రోజా చేసిన వ్యాఖ్యల పై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో అని రాజకీయ వర్గీయులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.