ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ఒకరు పోలీస్ అధికారులపై వీరంగం వేశారు .చేసిందే తప్పు మరల తిరిగి ఆ అధికారులను తమ విధులను నిర్వహించకుండా అడ్డుతగులుతూ అధికార మదాన్ని వారిపై చూపించారు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో గుంటూరు లో రాజేంద్ర నగర్ కు చెందిన టీడీపీ నేత మద్దన రామాంజనేయస్వామి ఫుల్ గా త్రాగి కారు వేగంగా నడిపి ఒక చిన్నారిని రాత్రి ఏడు గంటల ప్రాంతంలో డీకొట్టాడు .
దీంతో వెంటనే అప్రమత్తం అయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు .వెంటనే చేరుకున్న పోలీసులు సదరు టీడీపీ నేత త్రాగి ఉండటాన్ని గమనించి బ్రీత్ ఎన్ లైజర్ లో ఊదలంటూ పోలీస్ అధికారులు పట్టుబట్టారు .దీంతో చిర్రెత్తుకోచ్చిన ఆయన నేను ఎవర్ని అనుకుంటున్నారు ..మా పార్టీ అధికారంలో ఉంది .స్థానిక మంత్రులు అందరు నాకు తెల్సు ..వారితో ఫోన్ చేయించాలా ..
అయిన మీకు మాతో పని ఉంటది .అప్పుడు చూసుకుంటా ..అసలు ఏమనుకుంటున్నారు ..అధికారంలో ఉన్న మేము ఏమి చేసిన చూస్తూ ఊరుకోవాలి కానీ ఇలా అడగటం ఏమిటి ..సీఐలకే పోస్టింగ్స్ ఇప్పిస్తా నేను అట్లాంటిది నన్ను ఇలా చేస్తారా మీ అంతు చూస్తా అని బెదిరింపులకు దిగారు .ఆ సమయంలో ఫోటోలు తీయడానికి ప్రయత్నించిన అసిస్టెంట్ రైటర్ని తీవ్ర పదజాలంతో దూషిస్తూ కొట్టబోయాడు .ఇంతలో ట్రాపిక్ పోలీసు అధికారి వచ్చి అక్కడ నుండి తీసుకెళ్ళాడు .