తెలంగాణ రాష్ట్ర మాజీ సీనియర్ మంత్రి ,ప్రస్తుత సీఎల్పీ నేత జానారెడ్డిను ఆ పార్టీకి చెందిన సభ్యులు నిండు సభలో అడ్డంగా బుక్ చేశారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి టీఆర్టి నోటిఫికేషన్ జారీచేసిన సంగతి విదితమే .అయితే ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టి మరి ఉమ్మడి హైకోర్టుకు వెళ్లారు అని అధికార పక్షం ప్రధాన ఆరోపణ .
సభలో నిరుద్యోగ సమస్యపై జరిగిన చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ హయంలోనే ఉద్యోగ భర్తీ జరిగింది .గత మూడున్నర ఏండ్లుగా ఒక్క ఉద్యోగ భర్తీ జరగలేదని ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేశారు .దీనికి సమాధానంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ,విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ముందు ప్రతిపక్షాలు టీఆర్టి నోటిఫికేషన్ మీద స్టాండ్..పది జిల్లాలను పరిగణలోకి తీసుకొని భర్తీ చేయాలా ..లేదా ముప్పై ఒక్క జిల్లాలను పరిగణలోకి తీసుకొని చేయాలా ..మీ స్టాండ్ ఏమిటో చెప్పాలని అడిగారు .
దీంతో సమాధానంగా జానారెడ్డి లేచి మీరు పది జిల్లాలను పరిగణలోకి తీసుకొని చేస్తారా ..లేదా ముప్పై ఒక్క జిల్లాలను పరిగణలోకి తీసుకొని చేస్తారా ..మీ ఇష్టం ..మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వడమే మాకు కావాలని అనడంతో వెంటనే డిప్యూటీ లేచి మరి అలాంటప్పుడు ఉమ్మడి హైకోర్టుకు ఎందుకు వెళ్లారు అని నిలదీయడంతో ప్రతిపక్షాల ముఖ్యంగా జానారెడ్డి నోటి వెంట మాట రాకపోవడంతో సభ అంత నివ్వెరపోయింది .దీంతో జానారెడ్డి సెల్ఫ్ గోల్ లో పడ్డట్లు అయింది .