యాంకర్ రష్మీ. తెలుగు యువతకు పరిచయం అక్కర్లేని పేరిది. అతి తక్కువ కాలంలో బుల్లితెరపై ఓ వెలుగు వెలిగి.. వెండితెరపై కూడా తన సత్తాను చాటుతున్న యాంకర్లలో రష్మీ ఒకరు. ఓ పక్క బుల్లితెరపై యాంకరింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను.. మరో పక్క తన అదాందాలను ఆరబోస్తూ వెండితెర ప్రేక్షకులను అలరిస్తోంది యాంకర్ రష్మీ.
అతి తక్కువ కాలంలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో… అదే స్థాయిలో యాంకర్ రష్మీని గాసిప్స్ వెంటాడాయి. ఓ ప్రముఖ ఛానెల్‌లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో యాంకర్‌గా బాగా పాపులర్ అయిన రష్మీ.. అదే ప్రోగ్రామ్‌లో టీమ్ లీడర్ సుధీర్ మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అందుకుతోడుగా.. రష్మీ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవును సుధీర్, నేను డేటింగ్‌లో ఉన్నాం తప్పేంటి అంటూ ఇచ్చిన సమాధానం పెను దుమారమే రేపింది.
అయితే, తాజాగా వీరిద్దరికి చెడిందని బుల్లితెర కోడై కూస్తోంది. దీనికి కారణం… నెక్స్ట్ నువ్వే చిత్రం ప్రమోషన్‌లో భాగంగా రష్మీని సుధీర్ ఇంటర్వ్యూ చేయగా.. ఇరిటేట్ కలిగించేలా బిహేవ్ చేయడం, అందులోను.. అసలు నీలో ఏమి చూసి.. నీకు అవకాశం ఇచ్చారు. అమ్మ క్యారెక్టర్ ఇచ్చారా? అమ్మమ్మ క్యారెక్టర్ ఇచ్చారా..?? అంటూ అడగడంతో దీనిపై రష్మీ సీరియస్‌గానే రియాక్టైంది. అంత వరకు ఓపిక పట్టిన రష్మీ. ఫాదర్ క్యారెక్టర్ వస్తే నీవు చేస్తావా?? అంటూ సుధీర్‌పై ఎదురు దాడి చేసింది . దీంతో సుధీర్ సైలెంట్ అయిపోయాడు.
అయితే, ఇప్పుడు బుల్లితెర ప్రపంచం ఓ విషయాన్ని కోడై కూస్తోంది. అదే నటుడు బ్రహ్మాజీ, రష్మీల ఎఫైర్. కాగా, రష్మీ, బ్రహ్మాజీ కలిసి నటించిన ‘నెక్స్ట్ నువ్వే’ చిత్రంలో నటుడు బ్రహ్మాజీని తన హాట్ లుక్స్‌తో ఫిదా చేసిందని, అందుకే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రష్మీ, బ్రహ్మాజీ ఇద్దరూ క్లోజ్‌గా మూవ్ అయ్యారని అంటున్నారు బుల్లితెర జనాలు.
వీరి క్లోజ్‌నెస్ అంతటితో ఆగలేదు. నెక్స్ట్ నువ్వే చిత్ర బృందం ఇంటర్వ్యూలో భాగంగా గేమ్‌ను ప్లాన్ చేశారు. గేమ్ ఆడే సందర్భంలో బ్రహ్మాజీ వయస్సుపై చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే మధ్యలో కలుగజేసుకుని రష్మీ మాట్లాడుతూ.. బ్రహ్మాజీ గారు ఇప్పకీ యూత్‌గానే ఉన్నారు. ఆయన కండలను చూశావా? అంటూ హీరోయిన్ వైభవి శాండిల్యను అడిగింది రష్మీ. దీంతో ఏమో..నాకు తెలీయదంటూ సమాధానం ఇచ్చింది శాండిల్య. వెంటనే రష్మీ తన చేతిని బ్రహ్మాజీ మజిల్స్‌పై ఉంచి. సో హాట్.. హాట్.. అంటూ కితాబిచ్చింది.
ఇంకేముంది.. ఇప్పటి వరకు సుధీర్ రష్మీ అన్న బుల్లితెర జనాలు.. ఇప్పుడు బ్రహ్మాజీ రష్మీ అంటూ పేర్లు కలిపేశారు. యాంకర్ కమ్ నటి రష్మీపై వచ్చిన గాసిప్స్‌లో ఇదొకటి అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా బ్రహ్మాజీతో రష్మీ క్లోజ్‌నెస్ చూసి బుల్లితెర జనాలకు ఈ డౌట్ వచ్చినట్టుంది మరి.