అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ర్టీలోకి ఆరంగ్రేటం చేసింది అనుష్క. అనుష్క లెగ్ మహిమో.. మరేమోగాని.. ఆమెను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ఒకానొక టైమ్‌లో ఆమె కాల్షీట్లు లేక కొన్ని భారీ సినిమాలను సైతం వదులుకుంది ఈ స్వీటి.
అంతేకాదు, ఒకప్పుడు లేడీ ఒరియంటెడ్ సినిమాలంటే విజయశాంతేనని బ్రాండ్ ఉండేది.. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ అనుస్క సొతం. అంతలా తన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది అనుష్క. అనుష్క నటించిన అరుంధతి, రుద్రమదేవి సినిమాలే అందుకు ఉదాహరణ. అంతేకాదు అపజయం ఎరుగని ప్రముఖ దర్శకుడు రాజమౌళికి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది అనుష్క. అందులో భాగంగానే జక్కన్న చెక్కిన బాహుబలి చిత్రంలో అనుష్కకు ఓ కీలక రోల్ కూడా ఇచ్చాడు. ఆ సినిమా అనుష్క క్రేజ్‌ను ఓ స్థాయిలో నిలబెట్టిందని చెప్పవచ్చు.
అయితే, అనుష్క కెరియర్‌లో సినిమాల సంఖ్య ఎంత ఉందో.. గాసిప్స్ కూడా అదే సంఖ్యలో ఉండటం గమనార్హం. మరే హీరోయిన్‌పై ఇంతలా గాసిప్స్ రాలేదేమో అన్నంతగా స్వీటి అనుష్కపై గాసిప్స్ వచ్చిన విషయం విధితమే. మొదట్లో అనుష్కను ఇండస్ర్టీకి పరిచయం చేసిన నాగ్ నుంచి.. బాహుబలి చిత్రంలో ప్రభాస్ వరకు అనుష్కపై తోటి నటీ నటులతో లింకులు పెడుతూ వార్తలు రాసేశారు కూడాను. అంతటితో ఆగక ఒక అడుగు ముందుకు వేసి.. హీరో ప్రభాస్, అనుష్కలు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, అందులోను వీరికి వయసులో సరిజోడి కుదరడంతో త్వరలో వీరు దండలు కూడా మార్చుకోబోతున్నారనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే, అవన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది.
ప్రస్తుతం, అదే రీతిలో అనుష్కపై మరో గాసిప్ టాలీవుడ్‌లో ఓ పుకారు షికారు చేస్తోంది. అదేమిటంటే అనుష్క తాజా చిత్రం భాగమతిలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మళయాళ నటుడు ఉన్నీ ముకుందన్ కూడా ఓ కీ రోల్‌లో నటిస్తున్నాడు. అయితే, ఈ మధ్య స్వీటి అనుష్క తన బర్త్‌డే పార్టీకి ఉన్ని ముకుందన్‌కు ఆహ్వానం పలికిందని, దీంతో ఉన్ని ముకుందన్ అనుష్క ఇచ్చిన పార్టీలో పాల్గొని బర్త్‌డే కేక్‌ను కూడా కట్ చేయించాడట.
అసలు విషయం ఇక్కడే ఉందండోయ్.. ఆ పార్టీలో అనుష్కతోపాటు ఉన్ని ముకుందన్ ఒక్కడే ఉన్నాడట. అందులోను వారిద్దరు ఆ రోజు తీసుకున్న ఫోటోలు బయటకు రావడంతో.. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఏదేమైనా మొన్నటి వరకు ప్రభాస్, ద్రావిడ్, అంతకుముందు నాగార్జున వంటి ప్రముఖ హీరోలతో ఎఫైర్ అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ పిక్ బయటకు రావడంతో అనుష్క, ఉన్ని ముకుందన్‌ల మధ్య ఎఫైర్ అంటూ వార్తలు రాసేస్తున్నారు.