తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ప్రతి ఏడాది అటు ఇటుగా 150 సినిమాల వరకు విడుదల అవుతున్నాయి. దీంతో 24 క్రాఫ్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నంది అవార్డులను ప్రకటిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక 2014 నుండి నంది అవార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు తాజగా 2014, 2015, 2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను మంగళవారం ప్రకటించింది.
అయితే చంద్రబాబు సర్కార్ ప్రకటించిన నంది అవార్డుల ప్రకటన పై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈసారి నంది అవార్డులు ఒక కులం వారికే ప్రాధాన్యత ఇచ్చారనే టాక్ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. అసలు నంది అవార్డు రావడం అనేది వారి వారి టాలెంటులను బట్టి ఉంటుంది. కానీ ఒకప్పుడు అలాగే ఉండేది ఈ నంది అవార్డులు ఎంపిక. కానీ కాలక్రమేణా నంది అవార్డు నవ్వులపాలవుతుందనే మాట మాత్రం బాగా వినబడుతుంది. ఇప్పుడు ఇంతకీ నంది అవార్డులతో కొంతమందికి న్యాయం జరుగుతుండగా.. మరికొంతమందికి అన్యాయం జరుగుతోందనే విషయం మాత్రం తేటతెల్లమైంది.
ఇక 2016 గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ ఎంపిక అవ్వగా.. ఉత్తమ చిత్రంగా పెళ్ళిచూపులు చిత్రం ఎంపికైందది. అయితే 2014 , 2016 నంది అవార్డుల విషయంలో కొంత వరకు సంతృప్తిగా ఉన్న అభిమానులు 2015 సంవత్సరంకి ప్రకటించిన నంది అవార్డుల లస్ట్‌ను మాత్రం జీర్ణించుకోలే పెదవి విరుస్తున్నారు. దీంతో తాజా నంది అవార్డుల ఎంపిక వెనుక కుల రాజకీయాలు చేశారనే మాట బలంగా వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ నంది అవార్డుల వెనుక బాలకృష్ణ హ్యాండ్ గట్టిగా ఉందంటున్నారు కూడా. ఏది ఏమైనా నందుల ప్రకటన ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని గొంతులో పచ్చివెలక్కాయ పడేలా చేసిందని.. చంద్రబాబు సర్కార్ ప్రకటించిన తాజా నంది అవార్డులు ఎక్కువ శాతం కమ్మ వాసన కొడుతోందని సోషల్ మీడియాలో సినీ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.