తెలంగాణ టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు.ఇవాళ శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరసన తెలుపడాన్ని మంత్రి హరీష్‌రావు తప్పుబట్టారు. సభలో ఏదైన ఒక విషయం మీద నిరసన వ్యక్తం చేయాలనుకున్నప్పుడు ఫ్లోర్ లీడర్ కానీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కానీ నిరసన వ్యక్తం చేస్తారు. వీరిద్దరూ లేనప్పుడు ఉపనాయకుడు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటదని తెలిపారు. కాంగ్రెస్ ఉపనాయకుడు జీవన్‌రెడ్డి ఉన్న తర్వాత.. వేరే సభ్యుడు నిరసన చేయడం సరికాదన్నారు. ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ సభ్యులకు సభా సంప్రదాయాల మీదా గౌరవం లేదా? లేక నాయకుడు, ఉపనాయకుడిపై విశ్వాసం లేదా? లేక కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ఉన్నాయా అన్నది వాళ్లిష్టమని హరీష్‌రావు అన్నారు. కానీ సభా సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ.. తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. శాసనసభా వ్యవహారాల మంత్రికి అవగాహన లేదనడం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నానని హరీష్‌రావు పేర్కొన్నారు.మొబిలైజేషన్ అడ్వాన్స్‌లకు, ఈపీసీ టెండర్లకు, సర్వే డిజైన్ల పేర్ల మీద పనులు చేయకుండా కోట్ల రూపాయాలు కొల్లగొట్టి.. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన కాంగ్రెస్ నేతలకు కమిషన్ల గురించి మాట్లాడే హక్కుందా? అని మంత్రి ప్రశ్నించారు.