తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొంత కాలంగా పలు ప్రజాసమస్యలపై ,పథకాల అమలుపై చర్చవంతంగా జరుగుతున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఈ రోజు బుధవారం మొదలైన శాసనసభ సమావేశాల్లో హైదరాబాద్ మహానగరంలోని డ్రైనేజీ ,మురుగు కాల్వల పై చర్చ జరుగుతుంది .చర్చలో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు గత మూడున్నర ఏండ్లుగా హైదరాబాద్ సర్వనాశనం అవుతుంది .
త్రాగునీటి వ్యవస్థ ,డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది అని ఆరోపించారు .దీనికి సమాధానంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అరవై యేండ్లలో నలబై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు ఈ మూడున్నర యేండ్లలో హైదరాబాద్ నాశనమైంది అని ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు.
ఒకప్పుడు హైదరాబాద్ మహానగరంలో త్రాగడానికి గుక్కెడు నీళ్ళు లేక నగరవాసులు ఇబ్బందులు పడితే మేము వచ్చిన ఏడాదికే రోజు త్రాగునీటిని అందిస్తున్నాము .పోయిన ఏడాది నలబై మూడు లక్షల అరవై ఒక్క వేల క్యూబిక్ మీటర్ల పూడిక తీస్తే ఈ ఏడాది మాత్రం అంతకంటే ఎక్కువగా డెబ్బై ఐదు లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల లోతు పూడిక తీశామని మంత్రి కేటీరామారావు తెలిపారు .నాలాల పూడికతీత సరిగ్గా జరుగుతుందా లేదా అనే దానిపై సర్వే ఇంటర్నల్ గా జరిగింది ..పని చేయని అధికారులపై ,సిబ్బందిపై చర్యలు తీసుకున్నాము అని మంత్రి సభకు తెలిపారు .