సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్.. జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిల మధ్య వైరం రోజు రోజుకు ముదురుతోంది. జబర్దస్త్ షో వేదికగా కత్తి మహేష్ బట్ట తల, పొట్టపై హైపర్ ఆది పంచ్‌లు వేయడం.. ఆ సన్నివేశాల వీడియో లింక్‌లను మా ఫ్రెండ్స్ పంపించారని.. అవి చూసిన తరువాత నాకు చాలా బాధ వేసింది అంటూ ఫేస్‌బుక్ లైవ్‌లో కత్తి మహేష్ హైపర్ ఆదికి వార్నింగ్ ఇవ్వడం పరిపాటిగా మారింది.
హైపర్ ఆది.. ఇప్పుడిది పేరు కాదు.. ఇదొక బ్రాండ్. కేవలం హైపర్ ఆది వేసే పంచ్‌ల కోసం జబర్దస్త్ చేసే ప్రేక్షకులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఒకానొక సమయంలో జబర్దస్త్ షో మొత్తం హైపర్ ఆది స్కిట్ మీదే నడుస్తుందన్న వార్తలు షికారు చేశాయి. అయితే, స్కిట్.. స్కిట్‌కు తన పంచ్‌ల పంథాను మారుస్తూ..పంచ్‌లలో పసను పెంచేందుకు హైపర్ ఆది తీవ్ర కసరత్తులే చేస్తున్నాడు. ఇందుకు నిదర్శనం కత్తి మహేష్ టార్గెట్‌గా హైపర్ ఆది వేసిన పంచ్ డైలాగ్‌లే..
గత వారంలో జరిగిన జబర్దస్త్ షోలో హైపర్ ఆది తన స్కిట్‌లో భాగంగా.. ప్రేమించడం అంటే పైన బట్ట.. కింద పొట్ట వేసుకుని సినిమా రివ్యూలు రాసినంత ఈజీ.. పెళ్లి చేసుకోవడమంటే సినిమా తీసినంత కష్టం అంటూ వేసిన పంచ్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించినా.. చివరకు ఆ పంచ్‌ల టార్గెట్ కత్తి మహేష్ అని అర్థం చేసుకున్నారు అంతా.
ఈ విషయం కాస్తా తన దృష్టికి పోవడంతో వెంటనే ఫేస్‌బుక్‌లైవ్ పెట్టేశాడు కత్తి మహేష్. ఓ వైపు పలువురు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే.. మరో పక్క పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. హైపర్ ఆదిలపై విరుచుకుపడ్డాడు. మనుషుల అప్పీరియన్స్ మీద, డ్రస్సింగ్‌ల మీద కామెంట్స్ చేస్తూ అపహాస్యం చేస్తున్న జబర్దస్త్ షోను అస్సలు చూడను. అయినా, ఆ షోకు అంత పెద్ద రేటింగ్స్ ఎందుకు వస్తున్నాయో! తనకు తెలియడం లేదన్నారు కత్తి మహేష్. బహుషా మనందరి దిగజారుడు తనానికి అదొక ఉదాహరణ అని అనుకుంటున్నానని అన్నారు.
అలాగే, నేను పవన్ కల్యాణ్ మీద కామెంట్ చేస్తే.. నాకు పొట్ట ఉంది. బట్టతల ఉంది.. అంటూ షోలో మాట్లాడుతుంటే మీరు నవ్వుతూ ఎంజాయ్ చేస్తారా?, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటే సెన్స్‌లెస్ నాయాళ్లు అనే అపోహను మీరు పెంచి పెద్ద చేయకండి అంటూ పవన్ కల్యాన్ ఫ్యాన్స్‌పై ఫైరయ్యాడు. అంతటితో ఆగక ఇకపై ఇలాంటి పంచ్‌లు వేస్తే జబర్దస్త్ షోకి వచ్చి మరీ కొడతానని హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చాడు. నిన్నగాక.. మొన్న బుల్లితెరకు పరిచయమైన నీకు నాపై పంచ్‌లు వేసే స్థాయి లేదన్నాడు. ఇకనైనా బుద్ధిగా తన పంచ్‌లను మనుషులపై కాకుండా.. పరిపూర్ణమైన కామెడితో స్కిట్ హిట్ అయ్యేలా చూసుకోవాలని హితవు పలికాడు.
అయితే, కత్తి మహేష్ ఇలా ఫేస్ బుక్ లైవ్ వేదికగా హైపర్ ఆదికి వార్నింగ్ ఇవ్వడం.. దీనికి హైపర్ ఆది ఇంకా స్పందించకపోవడంతో.. కత్తి మహేష్ వార్నింగ్‌కు ఆది భయపడి అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడా అంటూ బుల్లితెర జనాలు చర్చించుకుంటున్నారు.