ఏపీ అధికార పార్టీ ,అనంతపురం పార్లమెంట్ నియోజక వర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన మాట్లాడుతూ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మంత్రులను డమ్మీలుగా మార్చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు .రాష్ట్రంలో మంత్రులకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ లేకుండాపోయింది .రాష్ట్రంలో పెత్తనం అంతా ముఖ్యమంత్రికే దక్కింది ..
ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు .కనీసం స్వతంత్రంగా మాట్లాడే అవకాశం ఉండటంలేదు అని ఆయన అన్నారు .అంతే కాకుండా రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రుల తొకలను టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కత్తిరించారు .అవి పెరగకుండా బాబు సున్నం రాశారు అని అన్నారు అని వార్తలు వస్తోన్నాయి .అయితే గతంలోనే జేసీ ఇటు జగన్ అటు చంద్రబాబు గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే .