ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈ రోజు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి భూమా అఖిల ప్రియ ఇలాఖా ఆళ్లగడ్డలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు .
ఈ క్రమంలో నియోజక వర్గంలో వివధ వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బలహీనవర్గాల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఆయన పాదయాత్రలో భాగంగా జగన్ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలో వస్తే రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల వారికి నలబై ఐదేండ్లకే వృధ్యాప పించన్ ఇస్తాము అని ప్రకటించారు .
రాష్ట్రంలో ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనార్టీ వర్గాలలో చాలా మంది పేదవారు ఉన్నారు .వారిని ప్రభుత్వం గాలికి వదిలేసింది .కానీ తాము అధికారంలోకి వస్తే నలబై ఐదేండ్లు ఉన్న ప్రతిఒక్కరికి నెల నెల రెండు వేల రూపాయలు పించన్ గా అందజేస్తాం అని ఆయన ప్రకటించారు .