వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయత్ర తొమ్మిదవ రోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్రకి జనం రోజు రోజుకి వేలల్లో తరలి వస్తున్నారు. కడప నుండి మొదలైన జగన్ పాదయాత్ర కర్నూలుకు చేరుకోగానే సెంచురీ కొట్టేశారు. మంగళవారం ఎనిమిదవరోజు పాదయాత్రలో వంద కిలో మీటర్ల మైలురాయిని దాటేశారు. దీంతో వందకిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్డంలోని గొడిగనూరు వద్ద జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఇక తొమ్మిదో రోజు జగన్ పాదయాత్ర దాదాపు 14 కిలోమీటర్లు వరకు చేయనున్నారని సమాచాం. బుధవారం ఆళ్లగడ్డ మండలం పెద్ద కోట కందుకూరు గ్రామంలో జగన్ పార్టీ జెండాను ఎగురవేసి మధ్యాహ్నం అక్కడే భోజన విరామానికి ఆగుతారు. తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఆళ్లగడ్డ మండలం నాలుగు రోడ్ల జంక్షన్ లో బహిరంగ సభలో మాట్లాడతారు. జగన్ కు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పెద్దయెత్తున స్వాగతం లభిస్తుండటంతో వైసీపీ శ్రేణుల్లో జోరు పెరిగింది.
ఇక జగన్ పాదయాత్ర ప్రారంభించిన మొదటి రోజునుండి ఎలాగైనా ఆటంకాలు సృష్టించడానికి పావులు కదుపుతున్న టీడీపీ బ్యాచ్‌కి మాత్రం ఇది మింగుడు పడడం లేదు. జగన్ పాదయాత్రకి అంత సీన్ లేదని భావించిన టీడీపీ బ్యాచ్‌కి షాక్ ఇస్తూ జనం బ్రహ్మరథం పడుతూ వేలల్లో ప్రజలు రావడం వారి కష్టాలు చెప్పుకోవడం చూస్తుంటే.. టీడీపీ బ్యాచ్‌కి గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఇక జగన్ కర్నూలులో అడుగు పెట్టగానే అక్కడి ఫిరాయింపు బ్యాచ్‌కి తడిసిపోయిందని.. జగన్ సెంచురీ దెబ్బకి కర్నూలు అపోజిషన్ అబ్బా అంటోందని.. జగన్ పాదయాత్రలో జస్ట్ సెంచురీ మాత్రమే చూశారని ఇక ముందు ముందు టీడీపీ బ్యాచ్‌కి చుక్కలే అని వైసీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు.