ఏపీ ప్రజల కష్టాలు పోయి స్వర్ణయుగం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. వైసీపీ అధినేత జగన్ అన్న సీఎం కావాలన్నదే తన ఆశయమని, అప్పుడే గ్రామం, మండలం అభివృద్ధి చెందుతుందని ఆ వ్యక్తి సూసైడ్ లెటర్‌లో ర పేర్కొన్నారు. కడప జిల్లా రాజుపాళెం మండలం టంగుటూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్ పాదయాత్రలో శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. పాదయాత్రలో పాల్గొని ఇంటికి చేరుకున్నంత అనంతరం ఆయన సూసైడ్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
