వైసీపీ అధినేత పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఇప్పటికే తన పాదయాత్ర ద్వారా సెంచురీ కొట్టిన జగన్ కర్నూలు గడ్డ పై అడుగు పెట్టి కేక పుట్టిస్తున్నాడు. ఇక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజక వర్గంలో జగన్ విజృంభిస్తున్నారు. పాదయాత్రతో పాటు ఏర్పాటు చేస్తున్న చిన్న చిన్న సభల్లో జగన్ చెలరేగి పోతున్నారు. జగన్ పాదయాత్రలో ఒకవైపు ప్రజల కష్టాలను తెలుసుకుంటూనే మరోవైపు తన మాటలతో చంద్రబాబు సర్కార్‌ను రఫ్ఫాడిస్తున్నాడు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుపున ఆళ్లగడ్డ క్యాండిడేట్‌ని కన్ఫాం చేశారని వైసీపీ వర్గీల నుండి ఓ వార్త బయటికి వచ్చింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా ఫ్యామిలీ, గంగుల ఫ్యామిలీలకు గట్టి పట్టుంది. అయితే గత కొన్ని ఎన్నికల నుంచి భూమా ఫ్యామిలీదే పైచేయిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో భూమా దంపతుల మరణానంతరం ఆళ్లగడ్డను తిరిగి తాము చేజిక్కించుకోవాలని గంగుల ఫ్యామిలీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే భూమా ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చిన వెంటనే గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరిపోయారు. జగన్ కూడా ఆయనను తక్కువగా చూడలేదు. వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ప్రస్తుతం గంగుల దృష్టంతా ఆళ్లగడ్డ పైనే ఉంది.
ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు గంగుల విజయేంద్రరెడ్డి… అలియాజ్ నానిని నిలబెట్టాలని గంగుల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అందుకోసమే.. జగన్ పాదయాత్రలో బాగంగా ఆళ్లగడ్డలో అడుగు పెట్టిన జగన్‌కు సంబంధించి అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటున్నాడు గంగుల నాని. గంగుల నాని విషయంలో జగన్ నుంచి హామీ కూడా పొందినట్లు తెలుస్తోంది. దీంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో విజయేంద్రరెడ్డి గత కొంతకాలంగా పర్యటిస్లూ.. సొంత క్యాడర్‌ను డెవలెప్ చేసుకుంటున్నారు. అందుకోసం ఆళ్లగడ్డలోనే ఉంటూ తన వద్దకు వచ్చిన ప్రతి కార్యకర్త సమస్యను అడిగి తెలుసుకుంటున్నారు. అఖిలప్రియ తో పోరుకు నాని సిద్ధమవుతున్నాడు. జగన్ కూడా నానిని వెంటేసుకుని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పర్యటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్నది గ్యారంటీ అని గంగుల వర్గీయులతో పాటు వైసీపీ వర్గీయుల్లో కూడా చర్చలు ప్రారంబమయ్యాయి.