ఇవాళ శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ సందర్భంగా.. ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు.రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు . 2016-17లో రూ. 3,200 కోట్ల బకాయిలు ఉంటే రూ. 2,896 కోట్లు చెల్లించామని తెలిపారు. ఈ అకాడమిక్ ఇయర్‌లో ఇంకా విద్యార్థుల డాటా అప్‌లోడ్ కాలేదని చెప్పారు.ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులకు అత్యధికంగా మెస్ ఛార్జీలను పెంచామని మంత్రి గుర్తు చేశారు. కళాశాల అనుబంధ వసతి గృహ విద్యార్థులకు స్కాలర్‌షిప్ రూ. 900 నుంచి రూ. 1500లకు పెంచామని పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులకు రూ. 520 నుంచి రూ. 750కు పెంచామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకే కాకుండా అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని ప్రతిపక్ష పార్టీల నేతలకు ఈటల రాజేందర్ సూచించారు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు.
Tags assembly Eetala Rajender Fee Reimbursement Finance Minister LEGISLATIVE ASSEMBLY telangana